ఒకటి కాదు.. రెండు కాదు.. 12 వేల పైచిలుకు ఉద్యోగాలు డిగ్రీ చదివిన వారి కోసం ఎదురు చూస్తున్నాయి. 12,074 క్లర్క్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ కొద్దిరోజుల క్రితమే విడుదల అయ్యింది. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే అంటే తొమ్మిదో తారీఖే ఆఖరి రోజు.
ఈ 12 వేలకు పైగా ఉద్యోగాలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవన్నీ క్లర్క్ పోస్టులే. ఈ సంఖ్య దేశమంతటికీ కలిపి చెప్పింది. ఇక ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో 1389 పోస్టులుఉన్నాయి. సెప్టెంబర్ 17నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
దరఖాస్తు చేయాలనుకునే వారు ఈరోజు సా. 5 గంటల వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షల వివరాల్లోకి వెళ్తే..
డిసెంబర్ 1, 8, 14, 15 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు ఉంటాయి. అందులో నెగ్గిన వారికి 2020 జనవరి 19న మెయిన్స్ పరీక్షలు ఉంటాయి.
ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు దాదాపు 45 రోజుల వరకూ సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్యాంకు ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ముందు క్లర్కుగా ఉద్యోగ జీవితం ప్రారంభమైనా ఆ తర్వాత ఉన్నత స్థానాలు పొందవచ్చు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours