చిలకలూరిపేట: గుంటూరుజిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఫోన్ కాల్ రికార్డును కమిటీ ముందు బయటపెట్టినందుకు ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్ అయ్యారు. చిలకలూరిపేట శారదా హైస్కూల్‌లో విద్యా కమిటీపై వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే రజిని.. హెచ్ఎం ధనలక్ష్మికి ఫోన్ చేసి ముందుగా వేసిన కమిటీని రద్దు చేయాలని హుకుం జారీ చేశారు. ఇదే విషయాన్ని హెచ్ఎం కమిటీకి తెలియజేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే తనతో ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ రికార్డును కూడా కమిటీ ముందు వినిపించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే రజిని సీరియస్ అయ్యారు. తన వాయిస్ రికార్డును బయటకు వినిపించడంపై హెచ్‌ఎం ధనలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానోపాధ్యాయురాలిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో హెచ్ఎం ధనలక్ష్మిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


-సోర్స్- ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్
Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours