AP Postal Jobs: ఏపీలో భారీగా 'పోస్టల్' ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి.
ప్రధానాంశాలు:

అక్టోబరు 15 నుంచి నవంబరు 14 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం
అక్టోబరు 22 నుంచి నవంబరు 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు అందుబాటులో

ఇండియా పోస్ట్ ఏపీ పోస్టల్ స‌ర్కిల్ పరిధిలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.

 గ్రామీణ్ డాక్ సేవక్‌: 2707 పోస్టులుపోస్టులు..

 బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (BPM)
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (ABPM)
డాక్ సేవ‌క్‌ (DS)

అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.

వ‌యోపరిమితి: 15.10.2019 నాటికి 18-40 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100. పోస్టాఫీసులో ఫీజు చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ప‌దోత‌ర‌గ‌తి మార్కుల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేష‌న్, ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం: 15.10.2019
రిజిస్ట్రేష‌న్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019
ఆన్‌లైన్ దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 21.11.2019.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి క్లిక్ చేయండి..

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

More details.    Visit official web
Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours