ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. నిరుద్యోగుల పట్ల ఇప్పటికే వరుస నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా కీలక ప్రకటన చేశారు. ఇసుక తరలింపు విషయంలో నిరుద్యోగులను భాగస్వామ్యం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
జిల్లాలో 2వేల మంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్ల ద్వారా కాపులకు వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
నిరుద్యోగ యువతకు ఇసుక రవాణా కాంట్రాక్టు ఇచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇసుక రవాణాకు సంబంధించి రవాణా కాంట్రాక్టు నిరుద్యోగులకు ఇచ్చే అంశంపై మార్గదర్శకాలు తయారు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఇకపోతే ఇప్పటికే వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిరుద్యోగులకు కీలక వరాలు ప్రకటిస్తూనే ఉన్నారు. నిరుద్యోగులకు వాలంటీర్లుగా అవకాశం ఇచ్చారు. ఇటీవలే గ్రామ సచివాలయం ఉద్యోగాల పేరుతో లక్ష 30వేల మందికి ఉద్యోగాలు కల్పించిన సంగతి తెలిసిందే.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours