దీపావళి సెలవుపై సందిగ్ధత

ప్రజాశక్తి  అమరావతి బ్యూరో
దీపావళి సెలవుపై ప్రభుత్వ ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొంది . ఈ నెల 27న సెలవు ఉంటుందా ? 28కి మారుతుందా అన్నది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది . ఈ నెల 27నే దీపావళి ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం తాజా పరిణామాలతో పునరాలోచనలో పడినట్లు సమాచారం . ఏ చతుర్దశి ఘడియాలు ఆదివారం మధ్యాహ్నం తరువాత వస్తాయని కాబట్టి సోమవారమే పండుగ అని కొంతమంది అంటున్నారు . హైకోర్టు కూడా సోమవారం సెలవుగా ప్రకటించింది . తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారమే సెలవు ఇచ్చింది . ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవును మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు . ఒకవేళ ఆ దిశలో సెలవు తీసకుంటే నేటి సాయంత్రం లోగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.

ఈ సంవత్సరం నరకచతుర్ధశి, దీపావళీ సమయ వివరణ


1.చంద్రోదయవ్యాప్తి కలిగిన చతుర్దశే నరకచతుర్ధశి అవుతుంది
2.అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయానికి చతుర్దశి ఉన్న పూర్వదినమే నరకచతుర్ధశి అవుతుంది. అనగా oct 26 శనివారం తైలాభ్యంగనం చేయాలి
3. దీపావళి కి ప్రదోషకాలమే ముఖ్యం . ప్రదోషకాలానికి అమావాస్య ఉన్నచో అదే దీపావళి అమావాస్య అవుతుంది(బ్రహ్మాండ పురాణం.).
4. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు చంద్రక్షయం కలిగి అపరాహ్ణం తర్వాత అమావాస్య వచ్చి స్వాతి నక్షత్రంతో కూడి ఉన్నచో అదే దీపావళి .దీనినే గ్రాహ్యంగా తీసుకోవాలి.( ధర్మసింధు)
5. Oct 27 ఉదయం చతుర్దశి 11.48 దాకా  ఉన్ననూ ప్రదోషకాలానికి అమావాస్య ఉండడటంవలన 28 ఉదయం అమావాస్యతో కూడిన స్వాతి నక్షత్రం ఉన్ననూ 28 ప్రదోషకాలానికి అమావాస్య లేదుకాబట్టి . పూర్వదినమే గ్రాహ్యం. అనగా 27 వతేదీనే దీపావళి పండుగ
Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours