గూగుల్‌ సరికొత్త పిక్సెల్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 4 ఎక్స్‌ఎల్‌గా పిలిచే ఈ మోడళ్లలోని మోషన్‌ సెన్సార్ల కారణంగా కేవలం చేయిని కదిలించడం ద్వారా ఫోన్‌లో కొన్ని పనులు చేసుకోవచ్చు. పిక్సెల్‌ 4 ధర 799 డాలర్లు కాగా,  4 ఎక్స్‌ఎల్‌ ధర 899 డాలర్లు. అమెరికాలో ఈ నెల 24 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.
* మోషన్‌ సెన్స్‌ సాంకేతికత వల్ల కాల్‌, అలారం, టైమర్లను చేయి ఊపడం ద్వారా వినియోగించవచ్చు.
* సరి కొత్త వాయిస్‌ రికార్డర్‌ యాప్‌తో, ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌లోనూ ఆడియో రికార్డింగ్‌లను ఇతర భాషల్లోకి అనువదించుకోవచ్చు
* 6 జీబీ రామ్‌, 64 జీబీ నిల్వ సామర్థ్యంతో పాటు 16 ఎమ్‌పీ, 12.2 ఎమ్‌పీ వెనక కెమేరాలు; 8 ఎమ్‌పీ ముందు కెమేరాలతో వస్తున్నాయి. యాండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేస్తాయి.
* పిక్సెల్‌ 4 తెర 5.7 అంగుళాలు; బ్యాటరీ సామర్థ్యం 2800 ఎమ్‌ఏహెచ్‌ కాగా, పిక్సెల్‌ 4 ఎక్స్‌ఎల్‌ తెర 6.3 అంగుళాలు; బ్యాటరీ సామర్థ్యం 3700 ఎమ్‌ఏహెచ్‌గా ఉంటుంది.
భారత్‌లో విడుదల కావు
ఈ ఫోన్లు భారత్‌లో విడుదల చేయడం లేదని గూగుల్‌ అధికారికంగా ధ్రువీకరించింది. ఎందుకంటే.. ఈ మోడల్‌లో వాడుతున్న మోషన్‌ సెన్స్‌కు ఉపయోగపడే సొలి రాడ్‌ చిప్‌ 60 గిగాహెర్ట్స్‌ స్పెక్ట్రమ్‌పై పనిచేస్తుంది. భారత్‌లో ఇందుకు అనుమతి లేదు. చాలా దేశాలు 60 గిగాహెర్ట్జ్‌ బాండ్‌పై లైసెన్సు అవసరాన్ని ఎత్తివేసినప్పటికీ.. మన దగ్గర ఇంకా ఆ పనిచేయలేదు. అందువల్లే పిక్సెల్‌ 4 మోడళ్లను భారత్‌లోకి గూగుల్‌ తీసుకురావడం లేదు. ల్యాప్‌ట్యాప్‌, ఇయర్‌ బడ్స్‌ను కూడా సంస్థ ఆవిష్కరించింది.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours