'గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నారా’? అంటూ 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న గుజరాత్ రాష్ట్ర వైద్యాధికారులను షాక్‌కు గురి చేసింది. అలాగే 12వ తరగతి ప్రశ్నపత్రంలోనూ ‘మీ ప్రాంతంలో మద్యం విక్రయాలు పెంచడానికి ఏం చేయాలో తెలుపుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాయండి’ అనే విచిత్ర ప్రశ్న కూడా విద్యార్థులకు ఎదురైంది. దీంతో ఖంగుతున్న అధికారులు ప్రశ్నపత్రాలు తయారు చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ గాంధీనగర్‌లోని సుఫలాంశాల వికాస్ సంకుల్ పాఠశాలలో 9వ తరగతి ఇంటర్నల్ పరీక్షలో ‘గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు’.? అనే ప్రశ్న విధ్యార్థులకు ఎదురైంది. అటు 12వ తరగతి వారికి ‘మద్యం విక్రయాలను ఎలా పెంపొందించాలో వివరిస్తూ లేఖ రాయమని అడిగారు.?, వీటి గురించి ఓ అధికారి మాట్లాడుతూ గవర్నమెంట్ గ్రాంట్స్‌తో రన్ చేస్తున్న సుఫలాంశాల వికాస్ సంకుల్ లాంటి పాఠశాలలో నాణ్యమైన భోదన ఉండదని.. ప్రశ్నపత్రాలు కూడా స్కూల్ మేనేజ్‌మెంట్ వాళ్లే రూపొందిస్తారని చెప్పారు. ఆ ప్రశ్నపత్రాలతో రాష్ట్ర విద్యాశాఖకు ఎటువంటి సంబంధం లేదని.. వెంటనే ఇలాంటి పాఠశాలలపై ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు జిల్లా డీఈఓ భరత్ వధేరా తెలిపారు.
గతంలో ఇలాంటి అభ్యంతరకరమైన ప్రశ్నలు తమిళనాడులోని ఓ పాఠశాల ప్రశ్నపత్రంలో ఎదురైతే.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours