అమెరికాలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసాకు సంబంధించి అగ్రరాజ్యం దౌత్యకార్యాలయం తాజాగా ఒక కీలక ట్వీట్ చేసింది. జాబ్‌లో జాయిన్ అయ్యే తేదీకి కనీసం మూడు నెలల ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తన ట్వీట్‌లో పేర్కొంది. హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందు 'ఐ-797' ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎంబసీ గురువారం ట్వీట్ చేసింది. ఇక 'ఐ-797' ఫారం అనేది “దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో కమ్యూనికేట్ చేయడానికి లేదా ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాన్ని తెలియజేయడానికి” యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఉపయోగించే పత్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం యూఎస్‌సీఐఎస్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇక భారత్-యూఎస్ ద్వైపాక్షిక సంబంధాల మధ్య ముఖ్యమైన సమస్యలలో భారతీయ పౌరులకు అమెరికా వర్క్ వీసా ఒకటి. అధికంగా భారతీయ నిపుణులు ప్రయోజనం పొందుతున్న హెచ్1బీ వీసా జారీలో ఇప్పటికే అమెరికా ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం లేకపోలేదు. ఈ వీసా ద్వారా అగ్రరాజ్యంలో పనిచేసే విదేశీయుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడంతో అమెరికన్లకు నష్టం వాటిల్లుతుందనే కారణంతో వీసా జారీని కఠినతరం చేస్తోంది యూఎస్.  

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours