పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ్ భారత్‌’లో భాగంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ బీచ్‌లో చెత్తను స్వయంగా తొలగించిన విషయం తెలిసిందే. తమిళనాడులోని మహాబలిపురం పర్యటనకు వెళ్లిన ఆయన..శనివారం ఉదయం అక్కడి బీచ్‌కు వెళ్లారు. అక్కడి పరిసరాల్లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ తన చేతిలో టార్చ్‌ వంటి పరికరాన్ని పట్టుకున్నారు. చెత్త తీస్తున్నప్పటి వీడియో వైరల్‌ కావడంతో అందరి దృష్టి ఆ పరికరం మీదనే పడింది. టార్చ్‌లైట్‌ అని కొందరు, తక్కువ బరువున్న డంబెల్‌ అని మరికొందరు భావించారు. దీని గురించి ప్రధాని మోదీ ఆయన సన్నిహితులు కూడా ప్రశ్నించారట. దీంతో స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా సమాధానం ఇచ్చారు.
మామల్లపురంలో నేను చెత్త తీస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న పరికరం గురించి నిన్నటి నుంచి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దాని పేరు ఆక్యుప్రెజర్‌ రోలర్‌. నేను దాన్ని తరచుగా వాడుతుంటాను. ఎందుకంటే నాకది ఎంతో మేలు చేసింది’ అని ట్వీట్‌ చేశారు. ఆక్యుప్రెజర్‌ రోలర్‌ అనేది చేతిలో ఇమిడిపోయే పరికరం. ఉదయపు నడక సమయంలో దీన్ని ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఈ పరికరం ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతికూల ఉద్వేగాలను నియంత్రిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. జీర్ణసంబంధిత వ్యాధులను, తలనొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours