మనలో చాలా మంది కోడిగుడ్లను ఫ్రిజ్‌లలో స్టోర్ చేస్తుంటారు. దీనివల్ల గుడ్లు త్వరగా పాడవ్వవని వారు భావిస్తారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి త్వరగా కుళ్లిపోతాయి. కనుక వాటిని బయట ఉంచడమే బెటర్. వీలున్నంత వరకు కోడిగుడ్లను మార్కెట్ నుంచి తేగానే త్వరగా వాడుకోవాలి.
ఇక ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లను కూడా తినరాదు. ఎందుకంటే ఫ్రిజ్‌లో గుడ్లను ఉంచినప్పుడు వాటి పెంకుపై బాక్టీరియా ఎక్కువగా అబివృద్ధి చెందుతుంది. దీంతో అలాంటి గుడ్లను తింటే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఫ్రిజ్‌లో ఉంచిన గుడ్లు పోషకాలను కోల్పోతాయి. రుచి మారుతుంది. కనుక ఫ్రిజ్‌లలో ఉంచిన గుడ్లను తినకపోవడమే మంచిది..!

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours