ఈ-కామర్స్‌ రంగంలో అమెజాన్‌కు దీటైన పోటీ ఇస్తోన్న దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా వినోద రంగంలోకి కూడా ప్రవేశించింది. వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్‌లోనూ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు దీటైన పోటీ ఇచ్చేందుకు తగిన ప్రణాళికలు వేసుకుంటోంది.
సంస్థ ఇటీవలే 'ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్' పేరిట వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ ప్రారంభించింది. దిగువ, మధ్య స్థాయి పట్టణాల వినియోగదారులే లక్ష్యంగా.. ఫ్లిప్‌కార్ట్ తన వీడియో కంటెంట్‌ను ఉచితంగా అందిస్తుందనే వార్త అమెజాన్‌ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
మన దేశంలో వీడియో స్ట్రీమింగ్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏడాదికి 21.8 శాతం వృద్ధితో ఈ వ్యాపారం దూసుకుపోతోంది. 2023 నాటికి ఈ వీడియో స్ట్రీమింగ్ వ్యాపారం రూ.11,977 కోట్లకు చేరుతుందని అంచనా.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours