రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్)లో వివిధ పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు నుంచి 2020 సంవత్సరానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. లెవెల్ 1 లో 2 ఖాళీలు, లెవెల్ 2లో 12 ఖాళీలు ఉన్నాయి.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను రాత పరీక్ష, స్కౌట్స్ సర్టిఫికెట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
వయస్సు:
అభ్యర్ధులు జనవరి 1, 2020 నాటికి లెవెల్ 2 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య, లెవెల్ 1 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వచస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళలు, మైనారిటీ, ఆర్థికంగా బలహీన వర్గాలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు చివరితేది: నవంబర్ 11, 2019.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours