World Egg Day: అల్పాహారంగా గుడ్డు తింటే మంచిది. గుడ్డును అల్పాహారంగా తీసుకుంటే బరువు తగ్గుతారు. గుడ్డులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. దీనివలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
కోడి గుడ్డు.. బోలెడన్ని పోషక పదార్థాలు, ప్రొటీన్లు, కొలైన్ల సమాహారం. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తారు. పచ్చి గుడ్డును, ఉడకబెట్టి, ఉడికించిన గుడ్డు బ్రెడ్‌ ని కలిపి టోస్ట్‌గా, పలావ్‌లలో, బేకరీల్లో కేకుల తయారీకి, ఆమ్లెట్‌, ఫ్రై ఇలా రకరకాలుగా వాడతాం. ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతుంది. ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. బరువు తగ్గడానికి ఉపయోగపడడమే కాకుండా, మెదడుకు ఆరోగ్యాన్ని సమకూర్చేందుకు గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డు సొనలో కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడు నుండి సంకేతాలు వేగంగా అందేందుకు కూడా ఉపయోగపడుతుంది. గుడ్డులో ఉండే ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ విధంగా ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కేన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వేలి గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. వాస్తవానికి సూర్యరశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డీ లభిస్తుంది. ఎండలో తిరగలేని వారికి గుడ్డు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. కాగా, అల్పాహారంగా గుడ్డు తింటే మంచిది. గుడ్డును అల్పాహారంగా తీసుకుంటే బరువు తగ్గుతారు. గుడ్డులో విటమిన్ ఏ కూడా ఉంటుంది. దీనివలన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిన్నపిల్లలకు గుడ్డును ఇవ్వడం వలన వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం ఉంటుంది. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇలా రోజు ఒక గుడ్డు తీసుకుంటే నరాల బలహీనత తగ్గి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours