భారత ప్రభుత్వానికి చెందిన తపాలా సంస్థ ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. కొద్ది రోజుల క్రితమే దేశంలోని వేర్వేరు సర్కిళ్లలో 10,000 పైగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేసింది ఇండియా పోస్ట్. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 5,476 ఖాళీలను ప్రకటించింది. బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. కనీసం 10వ తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి నవంబర్ 21 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ చూడండి.
మొత్తం ఖాళీలు- 5,476తెలంగాణ- 970
ఆంధ్రప్రదేశ్- 2707
చత్తీస్‌గఢ్- 1799
రిజిస్ట్రేషన్ & ఫీజ్ పేమెంట్ ప్రక్రియ ప్రారంభం- 2019 అక్టోబర్ 15 రిజిస్ట్రేషన్ & ఫీజ్ పేమెంట్‌కు చివరి తేదీ- 2019 నవంబర్ 14
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 22
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 21
విద్యార్హత- మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌తో 10వ తరగతి పాస్ కావాలి. 10వ తరగతి మొదటి ప్రయత్నంలో పాసైనవారిని మెరిట్‌గా గుర్తిస్తారు. స్థానిక భాష తెలిసుండాలి.
కంప్యూటర్ ట్రైనింగ్- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి కనీసం 60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. మెట్రిక్యులేషన్, ఇంటర్, ఉన్నత విద్యలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నా చాలు.
వయస్సు- 2019 అక్టోబర్ 15 నాటికి 18 నుంచి 40 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours