స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి పలు పరీక్షల తేదీలను తాజాగా వెల్లడించింది. ఈ మేరకు 2019 అక్టోబరు 1 నుంచి 2021 మార్చి 31 వరకు నిర్వహించనున్న వివిధ పరీక్షల షెడ్యూలును ప్రకటించింది. 2019 అక్టోబరు 14న సెలక్షన్ పోస్టుల పరీక్షతో ప్రారంభమయ్యే పరీక్షల క్యాలెండర్.. 2021 మార్చి 1న పూర్తయ్యే మల్టీటాస్కింగ్ పోస్టుల డిస్క్రిప్టివ్ పరీక్షతో ముగియనుంది. క్యాలెండర్ ప్రకారం 2019 పరీక్షల వివరాలు..
➥ అక్టోబరు 14 నుంచి 18 వరకు సెలక్షన్ పోస్టులు (ఫేజ్-7)-2019 కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష.
➥ నవబరు 17న మల్టీటాస్కింగ్ (నాన్‌టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామినేషన్-.2019 (పేపర్-2).
➥ నవంబరు 26న జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్ ఎగ్జామినేషన్-2019 (పేపర్-1).
➥ డిసెంబరు 9 నుంచి 13 వరకు ఎస్ఐ-సీఏపీఎఫ్, ఏఎస్‌ఐ-సీఐఎస్‌ఎఫ్, ఎస్ఐ-ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్-2019 (పేపర్-1).
➥ డిసెంబరు 29న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2018 (టైర్-3), జూనియర్ ఇంజినీర్ డిస్క్రిప్టివ్ పరీక్షలు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours