భిలాయ్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన విద్యార్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు..
* మొత్తం ఖాళీల సంఖ్య: 296
పోస్టులు ఖాళీల సంఖ్య
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) 123
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ-బాయిలర్ ఆపరేటర్) 53
మైనింగ్ ఫోర్‌మెన్ 14
మైనింగ్ మేట్ 30
సర్వేయర్ 04
జూనియర్ స్టాఫ్ నర్స్ (ట్రైనీ) 21
ఫార్మసిస్ట్ (ట్రైనీ) 07
సబ్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ (ట్రైనీ) 08
ఫైర్‌మ్యాన్ కమ్ ఫైర్ ఇంజినీర్ డ్రైవర్ (ట్రైనీ) 36
మొత్తం పోస్టులు 296
అర్హత: పదోతరగతి, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్.
దరఖాస్తు ఫీజు: కొన్ని పోస్టులకు రూ.250. కొన్ని పోస్టులకు రూ.150. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.10.2019
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.11.2019

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours