ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను నియంత్రించేందుకు అనేక సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో రహదారిని నిర్మించింది. ఫరీదాబాద్‌లోని ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో 850 మీటర్ల పొడవున ఐవోసీ ఈ రహదారిని నిర్మించింది. ఇటీవల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మహారాష్ట్రలోని నాగథానే పెట్రో కెమికల్‌ ప్లాంట్‌లో 40కి.మీ.మేర ప్లాస్టిక్‌ రోడ్డును నిర్మించిన సంగతి తెలిసిందే. నిత్యం మన వాడే క్యారీ బ్యాగ్‌లతో ఈ రహదారిని నిర్మించడం విశేషం.
‘తాజా పరిశోధనల ప్రకారం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డు దృఢంగానూ, ఎక్కువకాలం మన్నేలా ఉంటుంది. అంతేకాకుండా వర్షాలను తట్టుకుంటుంది. గుంతలు పడే అవకాశం తక్కువ’ అని ఐవోసీ తెలిపింది. పెట్‌ బాటిల్స్‌, మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌, సాఫ్ట్‌ డ్రింక్‌ బాటిళ్లను సులభంగా రీసైకిల్‌ చేయవచ్చు. అయితే, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తోనే సమస్య అంతా. ప్లాస్టిక్‌ బాటిళ్లను రీసైక్లింగ్‌ సెంటర్స్‌లో కిలో రూ.35కు కొనుగోలు చేస్తుండగా, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌కు ఎలాంటి విలువ రావడం లేదు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours