డిజిటల్ రూపంలో జనాభా లెక్కల సేకరణ వల్ల పౌరుల ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు ఖాతాలు వంటి వాటిని ఒకే కార్డులో నిక్షిప్తం చేయటడానికి వీలు కలుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ‘బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు’ను జారీ చేసే ఆలోచనను అమిత్ షా తెరపైకి తెచ్చారు. 2021 జనాభా లెక్కలలో తొలిసారిగా మొబైల్ యాప్‌ను ఉపయోగించబోతున్నట్లు ఆయన తెలిపారు. దీనిద్వారా ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
దిల్లీలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపట్టబోతున్న 8వ జనాభా లెక్కల సేకరణ 2021 మార్చి 1 అర్థరాత్రి 12 గంటలకు ముగుస్తుందని అమిత్ షా తెలిపారు. జనగణన, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) తయారీకి ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేయబోతోందని చెప్పారు.
‘‘ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతాలు వంటి సేవలను ఒక్క కార్డులోనే ఎందుకు పెట్టలేం? వాటి డేటాను ఒకే కార్డులో పొందుపరిచే వ్యవస్థ ఉండాలి. ఇది సాధ్యమే. ఇప్పటివరకూ అలాంటి ఆలోచనేదీ ప్రభుత్వ మదిలో లేకపోయినా అటువంటిది సాధ్యమే అని చెబుతున్నా’’ అని షా వ్యాఖ్యానించారు

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours