రిలయన్స్‌ జియో.. పండగలను పురస్కరించుకుని 4జీ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ జియోఫోన్‌ ధరను 50 శాతానికి పైగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ తగ్గింపుతో జియోఫోన్‌ రూ.699కే అందుబాటులో ఉండనుందని తెలిపింది. ఈ ఫోన్‌ను విడుదల చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా 2జీ యూజర్లు జియో ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చి చేరారని తెలిపింది. ఈ సంఖ్యను 35 కోట్లకు చేర్చాలనేది తమ లక్ష్యమని జియో పేర్కొంది. దసరా, దీపావళి పండగల సందర్భంగా రూ.1,500 గా జియోఫోన్‌ ధరను సగానికి సగం తగ్గించి రూ.699కే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జియో ప్రకటించింది. పాత ఫోన్‌ మార్పిడి లేకుండా, ఎలాంటి ప్రత్యేకమైన నిబంధనలను విధించకుండా రూ.800 తగ్గింపుతో ఈ ఫోన్‌ను విక్రయించనుంది

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours