ప్రముఖ విమానయాన కంపెనీ విస్తారా ఎయిర్‌లైన్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. 48 గంటల ప్రత్యేక సేల్ ఆవిష్కరించింది. అక్టోబర్ 10న టికెట్ ధరల డిస్కౌంట్ సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా విమాన టికెట్‌ను రూ.1,199 ప్రారంభ ధరతో బుక్ చేసుకోవచ్చు.
ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1,199 నుంచి ప్రారంభమౌతోంది. ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే కనీసం రూ.2,699 వెచ్చించాలి. ఇక బిజినెస్ క్లాస్ టికెట్‌ బుకింగ్‌ ధర రూ.6,999 నుంచి ప్రారంభమౌతోంది. అన్ని పన్నులు ఈ ధరల్లో కలిసే ఉన్నాయి. దేశీ ప్రయాణానికి మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయి.
జమ్మూ-శ్రీనగర్ టికెట్ దర రూ.1,199గా ఉంది. పండుగ సీజన్ సందర్భంగా ఈ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించినట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ తెలిపింది. కస్టమర్లు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours